ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : మంత్రి సీతక్క

ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం పెంచేందుకు చేపట్టిన ఈ ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు.

ఆమె మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. శరీరంలో ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అపోహలను తొలగించి, మహిళల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు.